హైదరాబాద్, అక్టోబర్ 03 (విధాత): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పార్థివ దేహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ,మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ నివాళులు అర్పించారు.
అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ.. రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఇక లేరు అనే వార్త కలిచివేసిందన్నారు. దామన్న నాకు అత్యంత సన్నిహితుడని, కాంగ్రెస్ పార్టీలో సాధారణ కార్యకర్త నుంచి మంత్రి వరకు ఎదిగిన ఒదిగి ఉన్న నేత.. 5 సార్లు ఎమ్మెల్యే గా పని చేశారన్నారు.
నేడు రాజకీయాల్లోకి వచ్చే యువతకు ఆయన జీవితం ఆదర్శమని, ఆయన ఆత్మకకు శాంతి చేకూరాలి.. వారి కుటుంబ సభ్యులకు అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు.