విధాత: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీగోదా శ్రీనివాస కల్యాణం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణం తిలకించి పరవశించిపోయారు.
జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి కుటుంబ సమేతంగా కల్యాణ ఉత్సవంలో పాల్గొన్నారు. గోదా అమ్మవారికి మంత్రి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం కల్యాణ తంతును తిలకించారు.