టికెట్ ఇవ్వకపోతే పోటీ చేయను : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌

బీజేపీ పార్టీ తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసి, తిరిగి గోషామహల్ టికెట్ ఇస్తుందన్న నమ్మకం ఉందని ఎమ్మెల్యే రాజాసింగ్ ధీమా వ్యక్తం చేశారు

విధాత : బీజేపీ పార్టీ తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసి, తిరిగి గోషామహల్ టికెట్ ఇస్తుందన్న నమ్మకం ఉందని ఎమ్మెల్యే రాజాసింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేయనని, హిందూ ధర్మం కోసం పనిచేసుకుంటానని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాలోనే తన పేరు ఉంటుందని, పార్టీ టికెట్ రాకపోతే ఎన్నికలకు దూరంగా ఉంటానన్నారు. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా మద్ధతునిస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని, ఇతర పార్టీల మద్ధతు లేకుండా బీఆరెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదన్నారు.