విధాత, వరంగల్ ప్రతినిధి : హనుమకొండ కలెక్టరేట్ లో పని చేసే తోటి మహిళా ఉద్యోగి పై మరో ఉద్యోగి అత్యాచారానికి యత్నించారు. ఈ సంఘటన సంచలనం సృష్టించింది. కలెక్టరేట్ ఎస్టాబ్లిష్మెంట్ డిపార్ట్మెంట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఇర్ఫాన్ సోహెల్ అత్యాచార యత్నానికి ప్రయత్నించగా బాధితురాలు కామాంధుడి నుంచి తప్పించుకొని సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు నిందితుడిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ దారుణ సంఘటన సమాచారం తెలియగానే కలెక్టర్ స్నేహా శబరీష్ స్పందించి అత్యాచార యత్నం చేసిన ఇర్ఫాన్ సోహెల్ ను సస్పెండ్ చేశారు. నిందితుడు కొన్నేళ్లుగా మహిళా సిబ్బందిపై వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటన పై పూర్తి విచారణ చేస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయంటున్నారు.
Hanamkonda Collectorate : హనుమకొండ కలెక్టరేట్ లో మహిళా ఉద్యోగి పై అత్యాచారయత్నం
హనుమకొండ కలెక్టరేట్‌లో తోటి మహిళా ఉద్యోగిపై అత్యాచార యత్నం చేసిన సీనియర్ అసిస్టెంట్ ఇర్ఫాన్ సోహెల్‌ను కలెక్టర్ స్నేహా శబరీష్ సస్పెండ్ చేశారు.

Latest News
పోతునూరు రైతుల “వరి” గోస
మళ్లీ పడిపోయిన పసిడి, వెండి ధరలు
షాకింగ్.. గర్భసంచి ఆపరేషన్‌కు వెళ్తే మహిళ కిడ్నీ తొలగింపు
రేపిస్ట్ నుంచి మహిళను కాపాడిన శునకం
వైరల్ వీడియో…ఆవు బొమ్మకు పాలు తాగేందుకు దూడ యత్నం !
‘పొలిటికల్ చౌరస్తా’లో కొండా ఫ్యామిలీ.. కొత్త పార్టీ పెడతారా?
DELULU Teaser: అత్తాపూర్ నీళ్ల ట్యాంకర్ దగ్గర ఆడోళ్లతో కొట్టిస్తా.. కడుపుబ్బా నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్!
రేవంత్ వెయ్యి రోజుల పాలనలో సాధించింది మహిళా మంత్రి బర్తరఫ్ : జగదీశ్ రెడ్డి
కృష్ణాష్టమి కానుకగా ‘కృష్ణంభజే’ ఫస్ట్ లుక్ లాంచ్
మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు