ప్రైవేటు ట్రావెల్స్‌లో భారీగా బంగారం పట్టివేత

సంగారెడ్డి జిల్లాలో పోలీసులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తనిఖీలు చేపట్టిన టాస్క్ పోర్స్ పోలీసులు

  • Publish Date - August 6, 2024 / 04:29 PM IST

విధాత, హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లాలో పోలీసులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తనిఖీలు చేపట్టిన టాస్క్ పోర్స్ పోలీసులు సుమారు 4.8 కిలోల బంగారు ఆభరణాలను పట్టుకున్నారు. ముంబయి నుంచి హైదరాబాద్‌కు వీటిని తరలిస్తున్నట్లుగా గుర్తించారు. సరైన పత్రాలు లేకపోవడంతో చంద్రేష్ అనే వ్యక్తి నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. బంగారంతో పాటు, దాన్ని తరలిస్తున్న వ్యక్తిని సంగారెడ్డి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆభరణాలకు సంబంధించి సరైన రికార్డులు లేకపోవడంతో అదంతా వ్యాపారులు బ్లాక్ దందాలో భాగంగా రవాణా చేస్తున్న బంగారంగా భావిస్తున్నారు.