విధాత, ఇల్లందు: ఇల్లందు అభ్యర్థిని మార్చాల్సిందేనని అసమ్మతి నేతలు మంత్రి కేటీఆర్‌ను డిమాండ్ చేశారు. సిటింగ్ ఎమ్మెల్యేకు బీ ఫాం ఇవ్వొద్దని పట్టుబడుతున్న అసంతృప్తి నేతలను మంత్రి కేటీఆర్ గురువారం హైదరాబాద్‌కు పిలిపించుకుని చర్చలు జరిపారు.
హరిప్రియకు టికెట్ ఇస్తే ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికే విజయావకాశాలు ఉంటాయని కేటీఆర్‌కు వివరించామని అసమ్మతి నేతలు చెబుతున్నారు. పేరుకు హరిప్రియ ఎమ్మెల్యేగా ఉన్నా.. అన్నీ ఆమె భర్త హరిసింగ్ చేతుల్లోనే ఉంటాయని తెలిపామని చెప్పారు. పార్టీ అన్ని విధాలుగా ఆలోచించి, మూడు రోజుల్లో స్పష్టత ఇస్తానని కేటీఆర్ తమకు హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు. కేటీఆర్‌పై తమకు నమ్మకం ఉన్నదని, తమ డిమాండ్లను అధిష్ఠానం ఆమోదిస్తుందని అసమ్మతి నేతలు చెప్పారు. ఈ నెల 15న పార్టీ అభ్యర్థులకు ముఖ్యమంత్రి, బీఆరెస్ అధినేత కేసీఆర్ బీఫాంలు అందజేయనున్న విషయం తెలిసిందే.