విధాత: సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బొమ్మర బోయిన కేశవులు మాట్లాడుతూ ఆర్టిఐ కార్యకర్తలు, ప్రజలు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీ.వో ప్రకారం ఏ విషయం పైన దరఖాస్తు చేయాలన్నా తప్పనిసరిగా రాష్ట్ర స్థాయి అధికారులచే ముందస్తుగా అనుమతి తీసుకుంటే గాని ప్రభుత్వాలు స్పందించకుండా ఉండేవిధంగా తయారు చేస్తూ ఆర్టిఐ యాక్ట్ ని నిర్వీర్యం చేయడం తగదని అలాంటి జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు .
అలాగే విద్యావేత్త వైద్యం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేతుల్లోకి తీసుకొని సవరణలు చేయడం చాలా దురదృష్టకరం. పౌరులు తమకు కావాల్సిన సమాచారాన్ని స్వేచ్ఛగా పొందే హక్కు రాజ్యాంగబద్ధంగా వారికి రాజ్యాంగం కల్పించిందని, దీనిని ఎవరు నిర్వీర్యం చేసే హక్కు లేదు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు. కావున వెంటనే ఈ ఆర్డినెన్స్ను ఉపసంహరించుకోవాలని కోరారు.మునగాల సుధారాణి మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వాలు చేయూత నీవ్వాల్సిన ఆర్టీఐ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం సరికాదు అని అన్నారు.ఈ కార్యక్రమంలో కత్తి భాస్కర్ రెడ్డి జిల్లా కన్వీనర్ ,లింగయ్య, సిహెచ్. సదాలక్ష్మి, రాజేంద్ర ప్రసాద్ ,ప్రణయ్ ,నాగరాజు జగన్ తదితరులు పాల్గొన్నారు.