విధాత, మెదక్ బ్యూరో: మెదక్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్ లో చేరుతున్నారు. బుధవారం హవేలి ఘనపూర్ మండలం కుచన్ పల్లికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సమక్షంలో బీఆరెస్ లో చేరారు. కాంగ్రెస్ నాయకులు నాలుగో వార్డు సభ్యులు దుర్గారి ఎల్లవ్వ, ఇర్ల కిషన్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి తలారి సంజీవులు, అరిక రాములు, దుర్గారి రమేష్, లింగాల అనిల్, సంపత్, చింతకింది మల్లేశం, శతెల్లి శ్రీనివాస్, తొగిట వెంకట్ తో పాటు 100 మంది కార్యకర్తలు పార్టీలో చేరారు.
వీరికి మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామ వార్డు సభ్యులు ఆకుల యాదగిరి తండ్రి వెంకట్ ఇటీవల ప్రమాదవశాత్తు బిల్డింగ్ పైనుంచి జారిపడ్డారు. ఈ ప్రమాదంలో వెంకట్ కు తీవ్ర గాయాలు కాగా చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్నారు. వెంకట్ ఇంటికి బుధవారం ఎమ్మెల్యే వెళ్లి పరామర్శించారు. వెంకట్ కు అన్నివిధాలా అండగా ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి, మెదక్ మాజీ జడ్పీటీస ఆంజనేయులు, నాయకులు మాణిక్య రెడ్డి, కొంపల్లి సుభాష్ రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీష్, గ్రామశాఖ అధ్యక్షులు తోగిట మళ్లయ్య, వార్డ్ మెంబెర్స్ కుర్మబయ్యన్న, ఆకుల యాదగిరి, మన్నే యాదగిరి పాల్గొన్నారు.