విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఆపార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో ఆదివారం పలువురు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం ప్రధాన కార్యదర్శి సింగం లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో 100 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా సింగం లక్ష్మి నారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలపై ఆకర్షితులై పార్టీలో చేరామన్నారు. రాహుల్ గాంధీ బీసీ కుల గణన చేస్తామని ప్రకటించడం హర్షణీయమన్నారు.
30న జరిగే ఎన్నికలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు సైదులు. మాజీ వార్డు మెంబెర్ గంటెకంపు లింగయ్య, కొత్త యాదయ్య, రుద్రాక్షి నాగేష్, చిత్రం విజయ్, కడారి వెంకన్న, కడారి వంశీ కడారి స్వామి, అంబటి శివ, రొయ్య రాంబాబు, వంపు సైదులు, కందుల శంకర్, బొమ్మరబోయిన మారయ్య పాల్గొన్నారు.