– ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
విధాత ప్రతినిధి, పెద్దపల్లి: మంథని కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఆయన తమ్ముడు శ్రీనుబాబు తమను ప్రలోభాలకు గురిచేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఒత్తిడికి గురిచేస్తున్నారని కమాన్ పూర్ ఎంపీపీ దంపతులు రాచకొండ లక్ష్మి – రవి ఆరోపించారు. ఈమేరకు శనివారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి హనుమానాయక్ కు ఫిర్యాదు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబుకు మద్దతుగా పార్టీలో చేరితే భారీగా నగదు ఇస్తామని శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు, ఆయన పీఏ గా చెప్పుకుంటున్న ప్రసాద్ రెడ్డి ఫోన్ కాల్ ద్వారా ప్రలోభ పెడుతూ తీవ్రంగా ఒత్తిడికి గురిచేస్తున్నారని పేర్కొన్నారు. మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ కింద వారిపై చర్యలు చేపట్టి ఎన్నికలు సజావుగా సాగేందుకు వారిపై అవినీతి వ్యతిరేక చట్టం, ఆర్పీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.