విధాత: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం వేములపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక సెంటర్ లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, ఆడిషనల్ కలెక్టర్ ఖుష్భూ గుప్తాలతో కలిసి ప్రారంభించారు. తాను కూడా కంటి పరీక్షలు చేయించున్నారు.
ఈసందర్భంగా గుత్తా మాట్లాడుతూ త్వరగా కంటి పరీక్షలు చేస్తూన్న వైద్య సిబ్బందిని అభినందించారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. తెలంగాణ రాష్టంలో ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ పని చేస్తున్నారన్నారు.
మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు,రైతు భీమా,దళిత బంధు, కంటి వెలుగు పథకాలను ఇతర రాష్టాల్లోని ప్రజలు అక్కడ కూడా అమలు చేయాలని కోరుతున్నారు. 100 రోజుల్లో తెలంగాణ ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహించాలని గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉండటం అభినందనీయమన్నారు.
మన రాష్ట్రంలో విద్య,వైద్య అధికారులు ఎంతో అద్భుతంగా పని చేస్తున్నారని, పంజాబ్,ఢిల్లీ రాష్ట్రాల సీఎం లు కూడా మన కంటి వెలుగు ప్రోగ్రాం ను వారి రాష్ట్రాల్లో అమలు చేస్తామని ప్రకటించడం ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వ ఖ్యాతి దేశ వ్యాప్తంగా పెరిగిందన్నారు. తెలంగాణ పథకాలను కోరుకుంటున్న
దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోవాలని కోరుకుంటున్నారన్నారు.