విధాత: రాష్ట్రంలో కంటి సమస్యలతో అంధత్వంతో బాధపడుతున్న ప్రజలకు కంటి వెలుగు ద్వారా ఈ నెల 18 నుండి ప్రతి గ్రామం, వార్డులో క్యాంప్ లు నిర్వహించి పరీక్షలు చేసి కళ్లద్దాలు అందించడమే ముఖ్య ఉద్దేశంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రూప కల్పన చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతానికి ప్రతీఒక్కరు కృషి చేయాలన్నారు.
నల్గొండ జిల్లా కేంద్రంలో సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల కలెక్టర్ లు, అధికారులతో నిర్వహించిన కంటి వెలుగు సన్నాహక, సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
మొదటి విడత నిర్వహించిన కంటి వెలుగు ద్వారా మంచి ఫలితాలు సాధించామని, ఈ నెల 18 న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు హైద్రాబాద్ నుండి కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభిస్తారన్నారు. ప్రజల దగ్గరకే వెళ్లి పరీక్షలు చేసి 100 రోజుల్లో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలన్నారు.
అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలు పంపిణీ చేయాలని, ప్రజా ప్రతి నిధులు, సర్పంచ్ లు, ఎం.పి.టి.సి.లు, ఎం.పి.పి.లు, జడ్.పి.టి.సి.లు, ఎం.ఎల్. సి.లు, ఎమ్మెల్యేలు అందరూ ఈ నెల 18 నుండి ప్రారంభం అయ్యే కంటి వెలుగు కార్యక్రమం లో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
కంటి వెలుగు ఏ రోజు ఏ గ్రామం లో నిర్వహిస్తారన్న షెడ్యూల్ ప్రజా ప్రతి నిధులకు అంద చేయడం జరిగిందన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నాటి ఉద్యమ నాయకుడు, సీఎం కేసీఆర్ తన పరిపాలనా దక్షతతో అనేక రంగాల్లో అత్యద్భుత ప్రగతి సాధించిందన్నారు.
కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా జడ్పి చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, రైతు బంధు సమితి అధ్యక్షులు, వైద్యాధికారులు పాల్గొన్నారు.