విధాత: సూర్యాపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన మంత్రి జగదీశ్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆయన సోదరి కట్టా రేణుక శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణానికి చెందిన వడ్డె సురేందర్‌రెడ్డి, గుంటకండ్ల ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్ కోట సత్యనారాయణరెడ్డి, నీరజ, శోభ, ఎం. బుచ్చిరెడ్డి లు కట్టారేణుక ఆధ్వర్యంలో బీఆరెస్‌లో చేరారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ 50 ఏళ్లలో ఏ పార్టీ చేయలేని అభివృద్ధిని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి జగదీశ్‌రెడ్డి 10 ఏళ్లలోనే చేసి చూపించారన్నారు.
ఆయనకు మరోసారి అవకాశం ఇస్తే సూర్యాపేటను ఇంకా అభివృద్ధి చేస్తారన్నారు. ఇక్కడి గ్రామాలు మరింత అభివృద్ది అవుతాయని అన్నారు. జగదీశ్‌రెడ్డి చేసినంత అభివృద్ది ఏ కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వంలో కూడా జరగ లేదని నిస్సంకోచంగా చెపుతున్నానన్నారు. కాబట్టి పని చేసే నాయకుడైన జగదీశ్‌రెడ్డిని గెలిపించుకోవడం మనందరి బాధ్యతని చెప్పారు.