విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం వెలువడిన తర్వాత తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవితఎక్స్‌లో పెట్టిన పోస్టు రాజకీయ వర్గాల్లో వైరల్ గా మారింది. ‘‘ కర్మ హిట్స్ బ్యాక్’’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవ్వగా..ఆ పార్టీ తన సిట్టింగ్ స్థానం కోల్పోయింది.
ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 98,988 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డికి 17,061 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,759 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అంతకుముందు జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో సైతం బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే.
Karma hits back !!! 🙏🙏🙏🙏
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 14, 2025
