KCR Handed Over B-Form To Sunitha | మాగంటి సునీతకు బీఫామ్ అందించిన కేసీఆర్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు పార్టీ అధినేత కేసీఆర్ బీ-ఫామ్ ఎన్నికల ఖర్చు నిమిత్తం ₹40 లక్షల చెక్కును అందించారు.

KCR Handed Over B-Form To Maganti Sunitha

విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీత గోపీనాథ్‌కు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బీ-ఫామ్ అందచేశారు. బీఫామ్ తో పాటు ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరఫున రూ. 40 లక్షల చెక్కు‌ను సునీతకు అందించారు. ఈ కార్యక్రమంలో సునీతా గోపినాథ్‌ వెంట ఆమె కూతుళ్లు, కుమారుడు, మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు తదితరులు ఉన్నారు.