Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. తొలి రోజు 10 నామినేషన్లు దాఖలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సోమవారం నోటిఫికేషన్ విడుదల కావడంతో రిటర్నింగ్ అధికారి పి సాయిరాం నామినేషన్ల స్వీకరించారు. ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 03.00 గంటల వరకు పలువురు నామినేషన్లను దాఖలు చేశారు. ఈ ఉపఎన్నికకు తొలిరోజు 10 నామినేషన్లు దాఖలయ్యాయి.

Jubilee Hills By Election First Day Nominations

Jubilee Hills By Election First Day Nominations

హైదరాబాద్, అక్టోబర్ 13, (విధాత): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సోమవారం నోటిఫికేషన్ విడుదల కావడంతో రిటర్నింగ్ అధికారి పి సాయిరాం నామినేషన్ల స్వీకరించారు. ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 03.00 గంటల వరకు పలువురు నామినేషన్లను దాఖలు చేశారు. ఈ ఉపఎన్నికకు తొలిరోజు 10 నామినేషన్లు దాఖలయ్యాయి.

అందులో రెండు రిజిస్టర్ పార్టీల అభ్యర్థులు కాగా.. 8 స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణా పునర్ నిర్మాణ సమితి తరుపున పూస శ్రీనివాస్ నామినేషన్ వేశారు. అలాగే నవతరం పార్టీ నుంచి అర్వపల్లి శ్రీనివాస రావు నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా సిలివేరు శ్రీకాంత్, పెసరకాయల పరీక్షిత్ రెడ్డి, చలిక చంద్ర శేఖర్, సపవత్ సుమన్, వేముల విక్రమ్ రెడ్డి, ఇబ్రహీం ఖాన్‌, సయ్యద్ ముస్తఫా హుస్సేన్, సల్మాన్ ఖాన్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.

రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి
జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలకు కొద్ది గంటల ముందు షేక్ పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కార్యాలయంను
జిల్లా ఎన్నికల అధికారి ఆర్ వి కర్ణన్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంను సందర్శించారు.
సన్నద్ధతను ఆర్వో , ఏఆర్వో లతో సమీక్షించారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా ఈసీఐ నిబంధనలకు లోబడి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి నామినేషన్ ల స్వీకరణకు సర్వ సన్నద్ధం గా ఉండాలని రిటర్నింగ్ అధికారి సాయిరాం కు సూచించారు.

Latest News