మీ వాళ్లే కనిపిస్తలేరు : బీఆరెస్ కౌంటర్
విధాత : సీఎం కేసీఆర్ గత 15రోజులుగా కనిపించడం లేదని, ఆయన కొడుకు,.. ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్వీట్టర్‌లో పోస్టు చేశారు. కేసీఆర్ కనిపించకపోవడం పట్ల తమకు ఏదో అనుమానం కలుగుతోందని బండి సంజయ్ సందేహం వ్యక్తం చేశారు.
కేసీఆర్‌ను కేటీఆర్ ఏమైనా చేసిండా? ఏమైనా ఇబ్బంది పెడుతుండా? ఎందుకంటే కేసీఆర్ మా సీఎం. ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు. కేసీఆర్‌తో ప్రెస్‌మీట్ పెట్టించండని, అప్పుడే ఆయన క్షేమంగా ఉన్నారని మేం నమ్ముతామని బండి తన ట్వీట్‌లో పేర్కోన్నారు.
బండి ట్వీట్‌కు కౌంటర్‌గా బీఆరెస్ సోషల్ మీడియా కూడా ఘాటుగా ప్రతిస్పందించింది. బీజేపీ మాజీ ఎంపీలు విజయశాంతి, విశ్వేశ్వర్‌రెడ్డి, వీవేక్, రాజగోపాల్‌రెడ్డితో పాటు ఎనుగు రవిందర్‌రెడ్డిలు కనిపించడం లేదని, వీళ్లని మోడీ, అమిత్‌షాలు ఏమైనా చేసినారా అంటూ కౌంటర్ ట్వీట్‌లతో ప్రశ్నించారు. రెండు పార్టీల మధ్య నెట్టింట సాగిన ట్వీట్ల వార్‌ను నెటిజన్లు ఆసక్తిగా తిలకించారు.