– కాకటియుల కాలం నాటి 20 గుళ్లను భక్తులు దర్శనం చేసుకునేలా అభివృద్ధి చేస్తాం
– సెప్టెంబర్ 9న మ్యూజియం ప్రారంభానికి చర్యలు
విధాత, వరంగల్ ప్రతినిధి:ఖిలా వరంగల్ ప్రాంతాన్ని ఎకో, టెంపుల్ టూరిజం గా అభివృద్ధి చేస్తామని.. అందుకు ప్రణాళికలు రచించాలని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అధికారులను ఆదేశించారు. సురేఖ ఆదివారం గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద, జిడబ్ల్యుఎంసి కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాఖడే, జిల్లా అటవీ శాఖ అధికారి అనుజ్ అగర్వాల్ తో కలసి ఖిలా వరంగల్లోని రాతి కోట ఉత్తర ద్వారం, ఏకాశీల క్రీడా మైదానం, అగర్త చెరువు మత్తడి, అగర్త చెరువు, లక్ష్మీ పత్రి గండి త్రికుటాలయాన్ని, పురావస్తు శాఖ మ్యూజియం, శంభుని గుడి ప్రాంతాలను పరిశీలించి ఏకో టూరిజం తో పాటు టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేయుటకు సంబంధిత అధికారులు పలు సూచనలు చేశారు. వరంగల్ రాతికోట ద్వారం వద్ద నిలిచిన వర్షపు నీరును పరిశీలించి, నీరు నిలవడానికి కారణాలు అధికారులతో తెలుసుకొని నిల్వ ఉండకుండా సాంకేతికపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అగర్త, చెరువును పరిశీలించి చెరువు సుందరీకరణ, బోటింగ్, ఫిషింగ్, లైటింగ్ తదితర ఏర్పాటుకు సమగ్ర ప్రణాళికలు చేయాలని మంత్రి అన్నారు. పురావస్తు శాఖ మ్యూజియం పనులను పూర్తిచేసి సెప్టెంబర్ 9న ప్రారంభించుటకు సిద్ధం చేయాలన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
ఖిలా వరంగల్ చుట్టుప్రక్కల ఉన్న కాకటియుల కాలం నాటి 20 గుళ్లను పునరుద్ధరణ చేసి పర్యాటకులు దైవ దర్శనం చేసుకునేలా దేవదాయ శాఖ ద్వారా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్లు బైరబోయిన ఉమా దామోదర్ యాదవ్, భోగి సువర్ణ సురేష్, ఓని స్వర్ణలత భాస్కర్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీవో కృష్ణవేణి, కుడా ప్రాజెక్ట్ అధికారి అజిత్ రెడ్డి, పురావస్తు, మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ, ఇరిగేషన్, ఎండోమెంట్ , ఎన్పీడీసీఎల్, వైద్య ఆరోగ్య సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు .