Kishanreddy | రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి.. కిషన్‌రెడ్డి డిమాండ్

తెలంగాణలో భూముల అమ్మకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. జోన్స్‌ (Zones) పునర్వ్యవస్థీకరణపై కూడా ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.

Kishan Reddy

విధాత, హైదరాబాద్ :

తెలంగాణలో భూముల అమ్మకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. జోన్స్‌ (Zones) పునర్వ్యవస్థీకరణపై కూడా ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కిషన్‌రెడ్డి, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పెట్టుబడిదారుల్లో అనుమానాలు కలిగించేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

ప్రస్తుత జీవో అమల్లోకి వస్తే భారీ ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. భూముల విలువలను ముందే తెలిసిన కొంతమంది లాభపడే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌ను మరో బెంగళూరుగా (రియల్ ఎస్టేట్ కేంద్రం) మార్చాలనుకుంటున్నారా? అని కిషన్ రెడ్డి ప్రభుత్వం ను ప్రశ్నించారు. ట్రాఫిక్ సమస్యలు, మౌలిక సదుపాయాల లోపాల వల్ల హైదరాబాద్‌లో పెట్టుబడులు తగ్ ఈ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చే విధంగా వ్యవహరిస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై ఇటీవల చేసిన వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. దేవుళ్లను చులకన చేస్తున్న రేవంత్‌ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. హిందూమతాన్ని అవమానించవద్దన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచే హిందూ దేవుళ్లను అవమానించే సంప్రదాయమే పాటిస్తోంది అని ఆయన ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణలు చెప్పాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ హిందుగాళ్లు బొందుగాళ్లు అంటూ వెటకారంగా మాట్లాడితే ప్రజలు ఏ రకంగా తీర్పు ఇచ్చారో గుర్తు చేసుకోవాలని హితవు పలికారు.

Latest News