హైదరాబాద్, అక్టోబర్ 03(విధాత): కొడంగల్ నివాసంలో దసరా గ్రీటింగ్స్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. దసరా సందర్భంగా నిన్న రాత్రి కొండారెడ్డిపల్లి నుంచి కొడంగల్ చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, నియోజకవర్గ ముఖ్య నాయకులు హాజరయ్యారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపేందుకు కార్యకర్తలు, స్థానికులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో సీఎం ప్రతీ ఒక్కరిని కలుస్తూ ఆప్యాయంగా పలకరించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని కొడంగల్ కాంగ్రెస్ నాయకులు, వక్ఫ్ కమిటీ సభ్యుడు యూసుఫ్ మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించడంతో ఆయన నివాసంలో మధ్యాహ్న భోజన కార్యక్రమానికి హాజరయ్యారు. భోజనకార్యక్రమం ముగించుకుని హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు.