Komati Reddy Rajagopal Reddy | గరిట తిప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. మధ్యాహ్న భోజన పథకం వంటల తనిఖీ

నియోజకవర్గం పరిధిలోని పాఠశాలలు, హాస్టల్స్‌ను తరుచు సందర్శిస్తూ వాటి మౌలిక వసతుల కల్పనను పరిశీలిస్తున్న మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మంగళవారం ఓ ప్రభుత్వ పాఠశాల

  • Publish Date - August 6, 2024 / 01:14 PM IST

విధాత, హైదరాబాద్ : నియోజకవర్గం పరిధిలోని పాఠశాలలు, హాస్టల్స్‌ను తరుచు సందర్శిస్తూ వాటి మౌలిక వసతుల కల్పనను పరిశీలిస్తున్న మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మంగళవారం ఓ ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజన పథకం నాణ్యతను ఆకస్మికంగా తనిఖీ చేశారు. చండూరు మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన సందర్భంగా స్థానిక ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు బోజన పథకం ఏజెన్సీ మహిళలు వండిన అన్నంను స్వయంగా కలిపి చూసి పరిశీలించారు. అనంతరం పోయ్యి మీద వండుతున్న కూరలలో గరిట తిప్పి తనిఖీ చేశారు. కూరల్లో మసాల వగైరా సరిగా వేస్తున్నారా లేదా అంటూ ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన అహారాన్ని అందించాలని సూచించారు. అనంతం మున్సిపాల్టీలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. స్వచ్చదనం పచ్చదనంలో భాగంగా మొక్కలు నాటారు.