కాంగ్రెస్ నుంచి కొత్త మనోహర్ రెడ్డి సస్పెన్షన్

విధాత, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత కొత్త మనోహర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు బుధవారం డీసీసీ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ లో టికెట్లు అమ్ముకుంటున్నారంటూ రాష్ట్రస్థాయి నేతలపై మనోహర్ రెడ్డి నిరాధార ఆరోపణలు, బహిరంగ ప్రకటనలు చేయడాన్ని ఆయన ఖండించారు.


టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించిన కొత్త మనోహర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఏదైనా సమస్య ఉంటే ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, ఏఐసీసీ పెద్దలతో మాట్లాడుకోవాలి కానీ మీడియాలోబహిరంగ ప్రకటన చేస్తే పార్టీ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.