మళ్లీ అధికారంలోకి వస్తే 4,5ఎకరాలకే రైతుబంధు: కేటీఆర్‌

  • Publish Date - November 8, 2023 / 04:22 PM IST

విధాత: బీఆరెస్ మళ్లీ అధికారంలోకి వస్తే 4,5ఎకరాలకే రైతుబంధు కటాఫ్ చేసే విషయమై పరిశీలిస్తున్నామన్నారు బీఆరెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్‌. రైతుబంధు స్కీమ్ డబ్బులు తక్కువ భూమి ఉన్న రైతులకు తక్కువ, ఎక్కువ భూమలున్న వారికి ఎక్కువ వస్తున్నాయని, ఈ తేడాను పరిశీలించి కటాఫ్ దిశగా ఆలోచన చేస్తున్నామన్నారు.


సోమాజిగూడలో మల్లాపూర్, గాంధీనగర్, జీడిమెట్ల, నాచారం, చర్లపల్లి ప్రాంతాలకు చెందిన పారిశ్రామిక వేత్తలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు విద్యుత్తు, పారిశ్రామిక రంగ అభివృద్ధిపైన, స్వయం పాలనపైన ఎన్నో అనుమానాలుండేవన్నారు. అలాంటి అనుమానాలన్నిపారద్రోలి వ్యవసాయ, గృహ, పారిశ్రామిక రంగాలకు నిరంతర విద్యుత్తును అందిస్తున్నామని, టీఎస్ ఐపాస్ తెచ్చి పారిశ్రామిక ప్రగతిని ముందుకు దూకించామన్నారు.