విధాత : ఉమ్మడి నల్లగొండ జిల్లాకు కృష్ణా జలాల సాధనకు దేవరకొండ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ,దివంగత నేత కటికనేని లక్ష్మణ్‌రావు జల సాధన ఉద్యమం ద్వారా చేసిన సేవలు చిరస్మరణీయమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. లక్ష్మణ్ రావు 80 వ జయంతి సందర్భంగా అంగడిపేట క్రాస్ రోడ్ వద్ద ఆయన విగ్రహాన్ని మాజీ మంత్రి జానారెడ్డి , దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్‌లతో కలిసి గుత్తా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ లక్ష్మణ్ రావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మా నీళ్లు మక్కావాలి అని కృష్ణా జల సాధన ఉద్యమాన్ని లక్ష్మణ్‌రావు నడిపించిన తీరు గుర్తు చేశారు. దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్‌తో పాటువివిధ హోదాలో లక్ష్మణ్ రావు చేసిన ప్రజాసేవ మరువలేనిదన్నారు. నిరంతరం ప్రజల సమస్యల గురించే వివరించేవారని ఆయన తెలిపారు. ఆయన మన మధ్యలో లేకపోయినా ఆయన చేసిన మంచి పనులు మనలో సజీవంగా బ్రతికే ఉన్నాయని ఆయన చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ త్వరగా పూర్తి చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు . దేవరకొండ నియోజకవర్గం, నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే లక్ష్మణ్ రావు ఆత్మకు నిజంగా శాంతి చేకూరుతుందని ఈ సందర్భంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు , ఎమ్మెల్సీ కోటి రెడ్డి , మాజీ ఎమ్మెల్యే చందర్ రావు , ఎంపీపీలు ప్రతాప్ రెడ్డి ,పాల్వాయి వెంకటేశ్వర్లు , జానీ యాదవ్ , యాదగిరి రావు , దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నర్సింహా , స్థానిక ప్రజాప్రతినిధులు , బంధువులు , కుటుంబ సభ్యులు , దుస్సర్ల సత్యనారాయణ , దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ దేవేందర్ నాయక్ ,తదితరులు పాల్గొన్నారు
జలసాధనలో లక్ష్మణ్‌రావు సేవలు చిరస్మరణీయం, విగ్రహావిష్కరణలో మండలి చైర్మన్ … గుత్తా హాజరైన జానా, బాలునాయక్
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు కృష్ణా జలాల సాధనకు దేవరకొండ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ,దివంగత నేత కటికనేని లక్ష్మణ్‌రావు జల సాధన ఉద్యమం ద్వారా చేసిన సేవలు చిరస్మరణీయమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

Latest News
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు
పక్కా స్కెచ్..నార్వార్ కోటలో 400ఏళ్ల నాటి ఫిరంగి దోపిడీ !
వానల కోసం గాడిదలకు పెళ్లి!