Site icon vidhaatha

High Court | దేవరకొండ మార్కెట్ స్థల వివాదంపై హైకోర్టు స్టే!

High Court

విధాత: నల్లగొండ జిల్లా దేవరకొండ మార్కెట్ స్థలం కేటాయింపు పై హైకోర్టు స్టే ఇచ్చింది. కూరగాయలు మాంసం మార్కెట్ కోసం కాలేజీకి చెందిన రెండు ఎకరాలను కలెక్టర్ కేటాయించడం వివాదాస్పదమైంది. విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని కలెక్టర్ నిర్ణయాన్ని ఇంటర్ విద్యా కమిషనర్ వ్యతిరేకించారు.

ఈ వివాదంలో కౌంటర్లు దాఖలు చేయాలని రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి, కలెక్టర్ కు, ఇంటర్ విద్యా కమిషనర్ కు, కాలేజీ ప్రిన్సిపాల్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 18 కి వాయిదా వేసింది.

Exit mobile version