కాంగ్రెస్‌కు గ‌రిష్ఠంగా 64 సీట్లు.. బీఆరెస్‌కు 53 వ‌ర‌కూ చాన్స్‌

  • Publish Date - November 6, 2023 / 11:50 AM IST
  • ఎంఐఎంకు 5-7 మ‌ధ్య‌
  • బీజేపీ రెండు లేదా మూడు
  • లోక్‌పోల్ తాజా స‌ర్వేలో వెల్ల‌డి

విధాత : రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏకైక అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవ‌త‌రిస్తుంద‌ని లోక్‌పోల్ తాజా స‌ర్వే అంచ‌నాలు పేర్కొటున్నాయి. అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డానికి ముందు ఒక విడుత స‌ర్వే చేసిన లోక్‌పోల్‌..

కాంగ్రెస్‌ పార్టీకి 61-67 మధ్య, 45-51 మధ్య సీట్లు సాధిస్తాయ‌ని పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. ఎంఐఎంకు 6 నుంచి 8 స్థానాలు ల‌భిస్తాయ‌ని, రెండు లేదా మూడు సీట్ల‌లో బీజేపీ ఆధిప‌త్యం చూపుతుంద‌ని వెల్ల‌డించింది. అయితే.. అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన త‌ర్వాత నిర్వ‌హించిన స‌ర్వే గ‌మ‌నిస్తే.. అంకెల్లో కొంత తేడా క‌నిపిస్తున్న‌ది. బీఆరెస్ క‌నిష్ఠంగా 47, గ‌రిష్ఠంగా 53 సీట్లు తెచ్చుకుంటుంద‌ని లెక్క‌గ‌ట్టింది . కాంగ్రెస్‌కు క‌నిష్ఠంగా 58, గ‌రిష్ఠంగా 64 సీట్లు ల‌భిస్తాయ‌ని తెలిపింది. ఎంఐఎంకు ఒక స్థానం త‌గ్గించింది. ఆ పార్టీ 5 నుంచి 7 సీట్లు గెలుచుకునే అవ‌కాశం ఉన్న‌ద‌ని పేర్కొన్న‌ది.


బీజేపీకి య‌థాత‌థ స్థితిని కొన‌సాగిస్తూ రెండు లేదా మూడు సీట్ల‌లో విజ‌యం సాధించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంచ‌నా వేసింది. ఇత‌రులు ఒక స్థానంలో విజ‌యం సాధించే అవ‌కాశం ఉన్న‌ద‌ని వెల్ల‌డించింది. ఈ స‌ర్వే కోసం 37,500 న‌మూనాల‌ను తీసుకున్న‌ట్టు లోక్‌పోల్ సంస్థ ప్ర‌క‌టించింది. ఇక శాతాల విష‌యానికి వ‌స్తే.. బీఆరెస్‌కు 39% – 42% మ‌ధ్య ఓట్లు ల‌భించే అవ‌కాశం ఉన్న‌ద‌ని తెలిపింది.


కాంగ్రెస్‌కు 41%-44% మధ్య ఓట్లు రావ‌చ్చ‌ని అంచ‌నా వేసింది. ఎంఐఎంకు మూడు శాతం నుంచి నాలుగు శాతం మ‌ధ్య‌, బీజేపీకి 9 శాతం నుంచి 12 శాతం మ‌ధ్య ఓట్లు ల‌భిస్తాయ‌ని స‌ర్వే పేర్కొన్న‌ది. ఇత‌రులు మూడు నుంచి 5 శాతం వ‌ర‌కూ ఓట్లు తెచ్చుకునే అవ‌కాశం ఉన్న‌ద‌ని అంచ‌నా వేసింది.