విధాత, హైదారాబాద్: కేసీఆర్ పాలన అంతాఆత్మహత్య లేనని ఏ వర్గానికి కూడా న్యాయం జరగలేదని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లురవి ఆరోపించారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో దళిత బంధు రాలేదని రమాకాంత్ అనే దళిత యువకుడు సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మొన్న ప్రవళిక ఉద్యోగం నోటిఫికేషన్ వాయిదా పడడంతో ఆత్మహత్య చేసుకుందని తెలిపారు.
సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ అంటూ బాధల తెలంగాణ చేస్తున్నారన్నారు. తెలంగాణలో ఏ ఒక్క వర్గం బాగు పడలేదని, ఈ 10 ఏళ్ల కాలంలో ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు తెలంగాణ అయ్యిందన్నారు. తెలంగాణ ప్రజలు తీవ్రమైన ఆవేదనలో ఉన్నారని తెలిపారు. రాబోయే ఎన్నికలలో ప్రజలు బీఆరెస్ ను ఓడించి కాంగ్రెస్ ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.