దేశంలోనే అత్యుత్తమ శిక్షణ సంస్థగా ఎంసీఆర్డీ
విధాత, హైదరాబాద్: దేశంలోనే మొట్టమొదట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను పరిపాలనలో పూర్తిస్థాయిలో ఉపయోగించిన రాష్ట్రంగా తెలంగాణ ఎదగాలన్నారు. అందుకు తగిన విధంగా శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ నుంచి గ్రామస్థాయి అధికారి వరకు శిక్షణ ఇవ్వాలని వెల్లడించారు.
స్వయం సహాయక సంఘాల లీడర్లకు జిల్లాస్థాయిలో, మండల స్థాయిలో రెండు రోజులపాటు శిక్షణ ఇచ్చి వారు ఆర్థికంగా ఉన్నత స్థానానికి ఎదిగేందుకు కృషి చేయాలన్నారు.
గత పది సంవత్సరాలు ఎంసీఆర్డీపై దృష్టి సారించలేదు ఇకనుంచి ప్రతి ఆరు నెలలకు ఒకసారి సబ్ కమిటీ సమావేశం అవుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంసీఆర్డీ డైరెక్టర్ జనరల్ శాంతి కుమారి పాల్గొన్నారు.