ఎంసీఎంసీ, మీడియా సెంటర్ పరిశీలన

సాధారణ ఎన్నికలు-2023 ఎన్నికల నియమావళిలో భాగంగా బుధవారం మెదక్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంసీఎంసీ, మీడియా సెంటర్ ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు

  • Publish Date - November 29, 2023 / 02:16 PM IST

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: సాధారణ ఎన్నికలు-2023 ఎన్నికల నియమావళిలో భాగంగా బుధవారం మెదక్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంసీఎంసీ, మీడియా సెంటర్ ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. ఎన్నికల్లో లోకల్ చానల్ ప్రసారాలు, ఎన్నికల ప్రకటనలు, చెక్ పోస్టుల వద్ద ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల రికార్డింగ్ పనితీరును పరిశీలించారు. టోల్ ఫ్రీ నంబర్ 1950లో వచ్చిన ఫిర్యాదులు,‘సీ’ విజిల్ లో వచ్చిన ఫిర్యాదులు, వాటి పరిష్కారాలు, ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ టీమ్ పనితీరు, మీడియాలో వచ్చే వార్తలు, పెయిడ్ న్యూస్, పత్రికాప్రకటనలు, ఎలక్ట్రానిక్ మీడియా రికార్డింగ్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.