విధాత : మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి, ఆయన అనుచరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు శుక్రవారం బీఆరెస్ పార్టీలో చేరారు. బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్‌లో తిరుపతిరెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మెదక్ కాంగ్రెస్ టికెట్‌ను మైనంపల్లి రోహిత్‌రావుకు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించడంతో ఆ పార్టీకి రాజీనామా చేసిన తిరుపతిరెడ్డి కారెక్కారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునితాలక్ష్మారెడ్డి సహా మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల బీఆరెస్ నేతలు పాల్గొన్నారు.