విధాత: కిడ్నీ వ్యాధిగ్రస్తులైన ఎయిడ్స్, హెపటైటిస్ రోగులకు ఉచిత డయాలిసిస్ సేవలు అందించాలని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. హైదరాబాద్ లో ఒక కిడ్నీ డయాలసిస్ కేంద్రం, వరంగల్ లో మరో కేంద్రం ప్రత్యేకంగా ఏ ర్పాటు చేయాలన్నారు. ఈ రెండు కేంద్రాల్లో ఐదు బెడ్స్, ఎయిడ్స్ పేషంట్లకు, ఐదు బెడ్స్ హెపటైటిస్ పేషంట్లకు కేటాయించి డయాలసిస్ సేవలు అందించాలని ఆయన సూచించారు.
వెంటనే ఈ రెండు కేంద్రాల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి సేవలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.కిడ్నీ వ్యాధిగ్రస్థులకు డయాలిసిస్ చేయించకోవడం ఆర్థికంగా చాలా భారంగా అవుతున్న నేపధ్యంలో C.M.KCR ఈ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని హరీశ్ రావు తెలిపారు.