మెదక్‌లో.. 180 కోట్లతో మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేసిన మంత్రి హరీశ్‌రావు

విధాత: మెదక్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో కర్ఫ్యులు.. కరువులు ఏ ర్పడ్డాయని ..బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు కనీసం ప్రతిపక్ష హోదా లేదని ,తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ సాధించేది టిఆర్ఎస్ పార్టీ అని తిరిగి ముఖ్యమంత్రి కేసీఆరే అవుతారని రాష్ట్ర ఆర్థిక , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. గురువారం సాయంత్రం మెదక్ లో 180 కోట్లతో నిర్మించనున్న మెడికల్ కళాశాలకు మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే, పద్మా దేవేందర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ హేమలత కలెక్టర్ రాజర్షి షాతో కలసి శంకుస్థాపన చేశారు.


నూతనంగా నిర్మించిన సెంట్రల్ లైబ్రరీ నూతన భవనాన్ని ప్రారంభించారు. 70 కోట్లతో మెదక్ లో జరిగే అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా సిఎస్ఐ చర్చి గ్రౌండ్ లో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది.ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ మెదక్ ను జిల్లా చేసి, ,మెదక్ కు మెడికల్ కళాశాల తెచ్చిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డినే మరోసారి దీవించాలని మెదక్ నియోజక వర్గ ప్రజలను కోరారు. డబ్బు సంచులతో కాంగ్రెస్ వాళ్లు పెద్దపెద్ద కార్లలో మెదక్ వస్తే మోసపోవద్దని టిఆర్ఎస్ పార్టీకే ఓటు వేసి పద్మా రెడ్డిని తిరిగి గెలిపించాలన్నారు.


 కాంగ్రెస్, బిజెపిలకు రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేదని,విమర్శించారు కాంగ్రెస్ టీడీపీ హాయాంలో మెదక్ జిల్లా వెనుకబడి పోయిందని అన్నారు.కాంగ్రెస్,బీజేపీ పార్టీల మెడలు వంచి సీఎం కెసిఆర్ తెలంగాణ సాధించారని అన్నారు.సీఎం కెసిఆర్ త్వరలో మేనిఫెస్టో విడుదల చేయనున్నారని,అప్పుడు కాంగ్రెస్,బీజేపీ పార్టీల మైండ్ బ్లాక్ అవుతుందన్నారు.సీఎం కెసిఆర్ అన్ని వర్గాల సంక్షేమం కోసం త్వరలో మేనిఫెస్టో విడుదల చేయనున్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు.


బీజేపీ వాళ్లు..కాంగ్రెస్ కు బి ఆర్ ఎస్ బి టీం అంటారు,కాంగ్రెస్ వాళ్లు బీజేపీ కి బి ఆర్ ఎస్ బి టీం అంటారు,మేము ఎవరికి బి టీం కాదు తెలంగాణ ప్రజలకు ఏ టీం గా పనిచేస్తున్నాం అన్నారు.తెలంగాణ ప్రజలే మాకు హైకమాండ్ అని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యా,వైద్యం,లో మెదక్ నియోజకవర్గాన్ని అగ్రభాగాన నిలిపామన్నరు.


మెదక్ కు మెడికల్ కళాశాల మంజూరు చేసిన సీఎం కెసిఆర్ కు ,సహకరించిన మంత్రి హరీష్ రావుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో జడ్పీ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్,మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, లైబ్రరీ చైర్మన్ చంద్రగౌడ్, వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి రైతు బంధు సమితి అధ్యక్షులు స్వాములు మల్లికార్జున్ గౌడ్ తో పాటు ఎంపీపీలు, జడ్పీటీసీలు,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. నియోజకవర్గం నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు.