– రైతులకు మ్యానిఫెస్టో వివరించిన మంత్రి
విధాత: సూర్యాపేట నియోజకవర్గవ్యాప్తంగా బీఆర్ఎస్ అభ్యర్థి, విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అన్నివర్గాల ప్రజలను కలిసి బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. శనివారం పెన్ పహాడ్ మండలం మేఖ్యా తండా నుండి వెళుతూ మంత్రి కాన్వాయ్ దిగి బుల్లెట్ ఎక్కారు. స్వయంగా బుల్లెట్ నడుపుతూ భక్తలాపురం వరకు ఎస్సారెస్పీ కాలువ వెంబడి రైడ్ చేశారు. రైతులు, వ్యవసాయ కూలీలతో మమేకమయ్యారు. వారిని ఆప్యాయంగా పలకరిస్తూ బుల్లెట్ బండిపై ముందుకు సాగారు. వారి బాగోగులు తెలుసుకుంటూ పార్టీ మ్యానిఫెస్టోను వివరించారు. రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్ తదితర పథకాల గురించి వివరించారు. నాలుగుకిలోమీటర్ల మేర మంత్రి బుల్లెట్ ప్రచారం సాగింది.