విధాత, హైదరాబాద్ : విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారి మీదుగా ఆంధ్ర వెళ్లే వారికోసం టోల్ చార్జీలను రద్దు చేయాలని కేంద్రాన్ని కోరడంపై వివాదాన్ని తాను పట్టించుకోనని తెలంగాణ ఆర్ ఆండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. తెలంగాణ వారు కూడా ఆంధ్ర సరిహద్దు వరకు ప్రయాణిస్తుంటారని వారందరికి కూడా తద్వారా ప్రయోజనం చేకూరుతుందన్నారు. అలాగే ఇతర తెలంగాణ జాతీయ రహదారులపై కూడా పండుగలకు వెళ్లే వారికి టోల్ చార్జీల రద్దు అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.
మేడారం జాతరకు వెళ్లే భక్తులకు కూడా టోల్ చార్జీల రద్దు కోరుతామని ..పండుగలకు టోల్ చార్జీల రద్దు అంశంలో ఎలాంటి వివక్షతకు వివాదానికి ఆస్కారం లేకుండా వ్యవహరిస్తామని వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి :
MLA Adinarayana Reddy : డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే కొడుకు అరెస్టు
Kavitha : ఎస్పారెస్పీ రెండో దశలో రెండు రిజర్వాయర్లు నిర్మించాలి
