Komatireddy Venkat Reddy : కొడుకు పేరుతో హైటెక్ స్కూల్ ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి

తనయుడి స్మృత్యర్థం రూ.10 కోట్లతో ‘హైటెక్’ స్కూల్! నల్లగొండలో ప్రతీక్ ఫౌండేషన్ పాఠశాలను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి.

Komatireddy Venkat Reddy

విధాత : దివంగత తనయుడు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి స్మారకార్ధం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధునాతన బోధనా వసతులతో కూడిన హైటెక్ హంగులతో నిర్మించిన పాఠశాలను ప్రారంభించారు. తనయుడు “కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్” ఆధ్వర్యంలో 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ” నల్లగొండ బొట్టుగూడ ప్రభుత్వ ప్రాథమిక,ఉన్నత పాఠశాల”ను మంత్రి కోమటిరెడ్డి మంగళవారం ప్రారంభించారు. పాఠశాలను సకల సౌకర్యాలు, అత్యాధునిక వసతులతో ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఏసీ, డిజిటల్ తరగతులతో బోధన వసతులతో రూ.10కోట్ల వరకు వెచ్చించి పునర్ నిర్మించారు.

ఈ పాఠశాలలో ప్రపంచంలోనే పేరొందిన “Woldorf” నూతన విద్యా విధానాన్ని పరిచయం చేస్తూ.. కార్పోరేట్ కు ధీటుగా అధునాతన హంగులతో “కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ప్రాథమికోన్నత బొట్టుగూడ పాఠశాల” నిర్మించారు. దీంతోపాటు.. నూతనంగా నిర్మించిన “NAC స్కిల్ డెవలప్మెంట్ సెంటర్” ను ప్రారంభించారు. అనంతరం సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ లో భాగంగా పలువురు మహిళలకు కుట్టు మిషన్లు మంత్రి వెంకట్ రెడ్డి అందించారు. నల్లగొండ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అధునాతన వైద్య పరికరాలను ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి :

Himachal Pradesh : హిమాచల్‌లో భారీ హిమపాతం.. రోడ్లు మూసివేత.. చిక్కుకుపోయిన పర్యాటకులు
Odisha | హృదయ విదారకం.. భార్య ప్రాణం కోసం 600 కి.మీటర్లు రిక్షా తొక్కిన వృద్ధుడు

Latest News