విధాత: ఎయిడెడ్ కాలేజీల విషయంలో ప్రభుత్వ ప్రతిపాదనలకు సమ్మతించని యాజమాన్యాలకు యథావిధిగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఎయిడెడ్ పోస్టులు, విద్యాసంస్థల ఆస్తులు సరెండర్ చేయాలని ఎలాంటి ఒత్తిడీ చేయబోమని ఉన్నత విద్యాశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు హామీఇచ్చారు. వివరాలు నమోదు చేసిన న్యాయస్థానం ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను రెండువారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలిచ్చింది. ఎయిడ్ కళాశాలల విలీనం విషయంలో అధికారులు ఒత్తిడిచేస్తే పోలీసులకు ఫిర్యా దు చేయాలని పిటిషనర్లకు సూచించింది.
ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఎలాంటి ఒత్తిడి చేయం
<p>విధాత: ఎయిడెడ్ కాలేజీల విషయంలో ప్రభుత్వ ప్రతిపాదనలకు సమ్మతించని యాజమాన్యాలకు యథావిధిగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఎయిడెడ్ పోస్టులు, విద్యాసంస్థల ఆస్తులు సరెండర్ చేయాలని ఎలాంటి ఒత్తిడీ చేయబోమని ఉన్నత విద్యాశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు హామీఇచ్చారు. వివరాలు నమోదు చేసిన న్యాయస్థానం ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను రెండువారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు […]</p>
Latest News

ఇకపై సహకార సంఘాలకు నామినేటెడ్ పాలక వర్గాలు
ఆగని వెండి..బంగారం పరుగు
లైవ్ షోలో బెంగాలీ గాయనిపై దాడి ప్రయత్నం..
సామాన్లు కనిపించేలా డ్రెస్సులు వేసుకోవడం ఏంటి..
దోసలు వేయాలనే తపనతో.. లక్షల రూపాయాల జీతాన్ని వదిలేసుకున్న యువకుడు..
రా అండ్ రస్టిక్ అవతార్లో రౌడీ స్టార్ ..
సంక్రాంతి రద్దీ.. వైజాగ్ - చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు
‘ధురంధర్’: భారతీయ సినిమా ఎరుగని ప్రశ్నలను అడిగిన చిత్రం
మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశివారికి వాహన ప్రమాదం.. జర జాగ్రత్త..!
కోఆర్డినేషన్ కమిటీతోనే గ్రేటర్ హైదరాబాద్ సమస్యలకు పరిష్కారం