PONNAM PRABHAKAR| ఎరువుల బాధ్యత కేంద్రానిదే

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుకి గ్రామీణ ప్రాంతాలు,వ్యవసాయం, ఎరువులు ఎక్కడి నుండి వస్తాయో తెలియనట్టు ఉందని మంత్రి పొన్న ప్రభాకర్ ఎద్దేవా చేశారు. ఎరువుల తయారీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందన్నారు

విధాత, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుకి గ్రామీణ ప్రాంతాలు,వ్యవసాయం, ఎరువులు ఎక్కడి నుండి వస్తాయో తెలియనట్టు ఉందని మంత్రి పొన్న ప్రభాకర్ ఎద్దేవా చేశారు. ఎరువుల తయారీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందన్నారు. తెలంగాణకు సరైన విధంగా ఎరువులు సరఫరా చేయమంటే చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. బీజేపీ ఎరువులు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తలేదని బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

దేశంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణ పట్ల కేంద్రం ఎంతో వివక్ష పూరితంగా వ్యవహరిస్తోందన్నారు. బీజే అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం, వ్యవసాయ మంత్రి తుమ్మల కేంద్ర మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారని పొన్నం పేర్కొన్నారు. అయినా బీజేపీ నాయకత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్టు కూడా లేదన్నారు. రైతుల విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని సూచించారు.

బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావుకి వ్యవసాయం, రైతులు, పల్లెలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అంటే తెలియదు. హైదరాబాద్‌లో కూర్చొని ఏదిపడితే అది మాట్లాడతా అంటే నడవదని హెచ్చరించారు. ఇప్పటికైనా కేంద్రం వెంటనే ఎరువులు ఇవ్వాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నామని మంత్రి పొన్నం వెల్లడించారు. కేంద్రం సరైన పద్దతిలో ఎరువుల సరఫరా చేయకపోవడం వల్లే ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు.