Site icon vidhaatha

దోపిడీపోవాలంటే వ్యవస్థ మారడమే మార్గం: మంత్రి సీతక్క

– ప్రపంచంలో ఉన్న కార్మికులు ఏకం కావాలి

 

విధాత, వరంగల్ ప్రతినిధి: శ్రమ లేకుండా మానవుడు లేడు. శ్రమ లేకుండా సంపద లేదు. శ్రమ లేకుండా మానవ జీవితమే లేదని రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అన్నారు. ములుగు జిల్లా కేంద్రములో ఏఐటీయూసీ, గ్రామపంచాయతీ కార్మికులు మేడే సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడారు. శ్రమైక జీవనసౌందర్యానికి సమానమన్నది లేనేలేదని, ఒక మనిషి శ్రమని మరో మనిషి దోచుకోవడం ప్రారంభమైన తర్వాత శ్రమతో సృష్టించబడిన సంపద పరాయికరణ చెంది ఎటువంటి శ్రమ చేయని కొద్ది మంది చేతుల్లో సంపద పోగుపడటం మొదలైందని శ్రమ పరాయీకరణతో క్రమంగా మనిషి పరాయీకరణ చెందాడని అన్నారు.

దోపిడీ అంతంకావాలంటే వ్యవస్థ మారడం తప్ప వేరే మార్గం లేదన్నారు. దోపిడీ రహిత సమాజం కోసం ఎర్ర జెండాను ఎత్తిని అమరవీరులకు జోహార్లు అర్పించారు. మేడే కేవలం ఎనిమిది గంటల పనిదినం కోసమే కాదు… శ్రామికుల శ్రమ దోపిడీని అంతం చేయాలన్నారు. కార్మిక వర్గ రాజ్యం స్థాపించడంతప్పచాలనే వారందరికీ స్ఫూర్తిని ఇచ్చేది మేడే అంటూ అందుకే ప్రపంచ కార్మికులారా ఐక్యం కండ, పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళుతప్ప అంటూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version