శ్రీవారి దర్శనం కోసం వచ్చినట్లుగా వెల్లడి
విధాత : నగరంలోని మీర్‌పేట జిల్లెలగూడలో అదృశ్యమైన బాలుడు మహీధర్ రెడ్డి ఆచూకీ లభ్యమైంది. ఈ నెల 4న ట్యూషన్‌కు వెళ్లిన బాలుడు.. ఆ తర్వాత కనిపించలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చేపట్టారు. సీసీ కెమెరాల వారిగా విచారణ కొనసాగిస్తు దర్యాప్తు ముందుకు దూకించారు. ఈ క్రమంలో తిరుపతిలో బాలుడి ఆచూకీ లభ్యమైంది. మలక్‌పేటలో రైలు ఎక్కి తిరుపతి వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు.. అక్కడి పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. బాలుడు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో ఉండగా…తిరుపతి బస్టాండ్‌లో స్కూల్ డ్రెస్‌తో తిరుగుతున్న బాలుడిని చూసిన స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో ఆ బాలుడిని ప్రశ్నించారు. తాను హైదరాబాద్ నుంచి వచ్చినట్టు తెలిపాడు. బాలుడి వద్ద నుంచి అతని తండ్రి ఫోన్ నెంబర్ తీసుకొని, ఫోన్ చేసి బాబు క్షేమంగా ఉన్నట్టు తెలిపారు. తిరుమల విధులకు వెళుతున్న ఎఆర్ కానిస్టేబుల్ ప్రసాద్ బాలుడిని గుర్తించి, తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. మీర్‌పేట ఇన్‌స్పెక్టర్ నాగరాజు కథనం ప్రకారం జిల్లెలగూడ దాసరినారాయణరావు నగర్‌కు చెందిన మధుసూధన్‌రెడ్డికి మౌనేంధర్‌రెడ్డి, మహీధర్ రెడ్డి(13) ఇద్దరు కుమారులు. మహీధర్ రెడ్డి మీర్ పేట్‌లోని ఓ ప్రైవేటు స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజు ఇద్దరు అన్నదమ్ములు మీర్‌పేటలో ట్యూషన్‌కు వెళ్తుంటారు. ఈనెల 4న (ఆదివారం) సాయంత్రం సోదరుడితో ట్యూషన్‌కు వెళ్లిన మహీధర్ రెడ్డి ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు మీర్ పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నాలుగు బృందాలను రంగంలోకి దింపారు. ట్యాషన్‌కు వెళ్తున్నాని చెప్పి బయటకు వచ్చిన బాలుడు ద్విచక్ర వాహనదారుడిని లిఫ్ట్ అడిగి కొంత దూరం వెళ్లిన తర్వాత బైక్ దిగి బస్టాప్ వద్దకు చేరుకున్నాడు. మీర్పేట్ జంక్షన్లో బస్టాప్‌లో దిగాడు. అలా నడుచుకుంటూ మలక్‌పేట్ వెళ్లాడు. రైల్వే స్టేషన్లోకి వెళ్లిన బాలుడు ట్రైన్ ఎక్కి తిరుపతి చేరుకున్నాడు. సీసీ ఫుటేజీలను పరిశీలించి తిరుపతి వెళ్తున్నట్లు గుర్తించి, అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తనకు తిరుపతికి వెళ్లాలనిపించిందని, ఆదివారం ట్యూషన్ లేదని భావించి తన వద్ద జమ చేసుకున్న వేయి రూపాయలతో తిరుపతికి వచ్చానని, ఉదయం 10గంటలకు లైన్‌లో ఉంటే సాయంత్రం 5గంటలక స్వామివారి దర్శనం అయ్యిందన్నారు. ఒక అన్న పరిచయమయ్యాడని, ఆయన నన్ను బస్టాండ్‌లో దించాడని, ఆయన ఫోన్‌తో తల్లిదండ్రులకు తాను తిరుపతి నుంచి ఇంటికి వస్తున్నానని చెప్పానని చెప్పాడు. గతంలో మా తల్లిదండ్రులతో 15సార్లు తిరుపతికి వచ్చానని, మా మామయ్య వాళ్లు తిరుపతిలోనే ఉంటారని తెలిపాడు. స్వామివారిని దర్శించుకుని ఏమని కోరుకున్నావన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు అవన్ని చెబుతురా అంటూ గడుసుగా సమధానమిచ్చాడు.