ఎమ్మెల్యే చందర్ తో లక్ష్మణరావు భేటీ

బీఆర్ఎస్ రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి నారదాసు లక్ష్మణరావు శనివారం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ని కలిసారు

విధాత, పెద్దపల్లి: బీఆర్ఎస్ రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు శనివారం రామగుండం ఎమ్మెల్యే ,పెద్దపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ ని కలిసారు. ఎమ్మెల్యే ఆయనను ఆత్మీయంగా స్వాగతించి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ ప్రచారాలపై చర్చించుకున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే వెంట డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, నాయకులు ఉన్నారు.