నల్గొండలో కంచర్ల ప్రచారం ముమ్మరం

నల్గొండ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు. బుధవారం పట్టణంలోని 18, 19, 40 వార్డుల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ పథకాలను ప్రచారం చేశారు

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: నల్గొండ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు. బుధవారం పట్టణంలోని 18, 19, 40 వార్డుల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ పథకాలను ప్రచారం చేశారు. రాబోయే ఎన్నికల్లో మరొకసారి గెలిపించాలని కోరారు. 20 ఏళ్లు పాలించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని, హైదరాబాద్ కేంద్రంగా పరిపాలన సాగించారని ఆరోపించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోనే తెలంగాణలో ప్రగతి పరుగులు పెడుతోందని చెప్పారు. నల్గొండలో ఉన్న ముఖ్యమంత్రి అభ్యర్థి కోమటిరెడ్డికి మరోసారి ప్రజలు గుణపాఠం చెప్పాలని కోరారు. కార్యక్రమంలో ఆలకుంట్ల నాగరత్నం రాజు, సంధినేని జనార్దన్ రావు, నాంపల్లి శ్రీనివాస్, బకరం శ్రీనివాస్ పాల్గొన్నారు.