Site icon vidhaatha

కోతి దాడిలో పదేళ్ల…. చిన్నారి మృతి

గాంధీనగర్ : గుజరాత్ లో దారుణం జరిగింది. కోతి దాడిలో పదేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన సోమవారం సాయంత్రం గాంధీనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం దేహగాం తాలూకాలోని సల్కీ గ్రామంలోని ఓ దేవాలయం సమీపంలో దీపక్ ఠాకూర్ (10)అనే చిన్నారి సోమవారం సాయంత్రం స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. అదే సమయంలోఅక్కడికి వచ్చిన కోతి అతనిపై దాడి చేసింది. కోతి ఎటాక్ తో చిన్నారి పొట్ట నుంచి పేగులు బయటకు వచ్చాయి .దీంతో చిన్నారిని ఆసుపత్రికి తరలించగా ఆ బాలుడు అప్పటికే మరణించినాడని వైద్యులు తెలియజేశారు. కాగా ఈ గ్రామంలో కోతులు అధిక సంఖ్యలో ఉన్నాయని అవి తరచూ స్థానికులపై దాడికి పాల్పడుతున్నట్టు గ్రామస్తులు వాపోతున్నారు. ఈ వారంలో ఇది నాలుగవ ఘటనని ఇంతకుముందు ముగ్గురిపై కోతులు దాడి చేశాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ కోతుల గుంపు చాలా పెద్దదని వాటిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇందుకోసం గ్రామంలో పలు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశామని సదరు ఫారెస్ట్ ఆఫీసర్ తెలిపారు.

Exit mobile version