Site icon vidhaatha

Prasannakumar Reddy| కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి

ప్రశాంతి రెడ్డి అనుచరుల పనే : నల్లపురెడ్డి
దాడితో నాకు సంబంధం లేదు : ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లోని కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. ప్రసన్న కుమార్ రెడ్డి తమ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై వ్యక్తిత్వ హననం చేసేలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకారులు ఎమ్మెల్యే ఇంటి ఫర్నీచర్‌, కారు ధ్వంసం చేశారు. దాడి సమయంలో ప్రసన్నకూమార్ రెడ్డి ఇంట్లో లేరు. కొన్ని రోజులుగా నల్లపురెడ్డి, ప్రశాంతి రెడ్డిల మధ్య మాటల యుద్దం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడినట్లుగా ప్రసన్నరెడ్డి ఆరోపించారు. దాడి సమాచారం తెలుసుకున్న ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వచ్చి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏదైనా ఉంటే రాజకీయంగా మాట్లాడాలని గాని..భౌతిక దాడులు చేయడం ఏమిటని మండిపడ్డారు. నేను, నా కొడుకు బయటకు వెళ్లాక టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని..ఇంట్లో వస్తువులన్నీ ధ్వంసం చేశారన్నారు. దాడి సమయంలో ఇంట్లో ఉన్న మా అమ్మను కూడా బెదిరించారని నల్లపురెడ్డి ఆరోపించారు. ఇంట్లో నేను ఉంటే చంపేవారని..నెల్లూరు జిల్లాలో దాడి సంస్కృతి ఎప్పుడూ లేదన్నారు. నాకు వైఎస్‌ జగన్‌ ఫోన్‌ చేసి దాడిపై ఆరా తీశారని నల్లపురెడ్డి తెలిపారు. తన ఇంటిపై జరిగిన దాడిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, లోకేష్ లు స్పందించాలన్నారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. మా ప్రభుత్వం వచ్చాకా మేం చేయాల్సింది చేసి చూపిస్తామని..ఈ దాడికి పాల్పడిన వారిపూ కూటమి ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దాడితో నాకు సంబంధం లేదు. : ప్రశాంతిరెడ్డి

అయితే నల్లపురెడ్డి ఇంటిపై దాడితో నాకు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధం లేదని కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్పష్టం చేశారు. దాడుల సంస్కృతి మాది కాదన్నారు. ప్రసన్నకుమార్ వల్ల చాలా మంది బాధపడ్డారని..వారిలో ఎవరో ఒకరు దాడి చేసి ఉండొచ్చు అనిప్రశాంతిరెడ్డి తెలిపారు. నాపై ఆరోపణలు చేసిన వైసీపీ నేతలకు నాది ఒకటే ప్రశ్న అని..నల్లపురెడ్డి నాపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను..వారి ఇళ్లలోని మహిళలకు చూపించండని సూచించారు. వైసీపీ నాయకుల ఇళ్లలోని మహిళలు నల్లపురెడ్డి మాటలను సమర్థిస్తారా అని ప్రశ్నించారు. నల్లపురెడ్డివ్యాఖ్యలను వైఎస్. జగన్‌ సీరియస్‌గా తీసుకోవాలని ప్రశాంతిరెడ్డి కోరారు. నా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యలను భరించలేని నా అభిమానులు ఎవరైనా దాడి చేసి ఉండవచ్చన్నారు. నేను నల్లపురెడ్డిపై అవినీతి, రాజకీయ విమర్శలకే పరిమితమయ్యాయని..కాని ఆయన అసెంబ్లీ ఎన్నికల్లోనూ..ఇప్పుడు కూడా నా వ్యక్తిత్వ హననం చేసేలా విమర్శలు చేశారని ప్రశాంతి రెడ్డి మండిపడ్డారు. జిల్లాలో 10అసెంబ్లీ సీట్లు టీడీపీ గెలువడంతో రాజకీయంగా మమ్మల్ని లక్ష్యంగా చేసుకున్నారన్నారు.

Exit mobile version