Site icon vidhaatha

Bear Adventur Attack: బిడ్డ జోలికిస్తే పులి అయినా బలాదూర్..ఎలుగబంటి సాహసం వైరల్ !

Bear Adventur Attack: మనుషులే కాదు..పశు పక్ష్యాదులు..వన్యప్రాణులు సైతం తమ సంతానానికి ఆపద వస్తే ప్రాణాలను ఫణంగా పెట్టి మరి పోరాడుతాయన్న సంగతి తెలిసిందే. బిడ్డ జోలికొస్తే ఎదుట ఎంత శక్తివంతమైన ప్రాణి ఉన్నా సరే.. లెక్క చేయకుండా పోరాడే జంతుజాలాన్ని చూస్తుంటాం. నీళ్ల కోసం వెళ్లిన ఎనుగు పిల్లలను, జిరాఫీలు, అడవి దున్నెల పిల్లలను టార్గెట్ గా చేసే మెుసళ్లు, పులులు, సింహాలతో వాటి తల్లులు చేసే బీభత్స పోరాటం తల్లి ప్రేమ గొప్పతనానికి నిదర్శనంగా కనిపిస్తుంటాయి. అలాంటి ఓ అరుదైన వీడియో వైరల్ మారింది. ఓ ఎలుగుబంటి అడవిలో తన బిడ్డ ఎలుగుబంటితో కలిసి దారిలో వెలుతుండగా..ఓ పెద్ద పులి దాడి చేసింది. అంతే క్షణాల్లో తేరుకున్న ఎలుగుబంటి తన వీపు వెనుకన బిడ్డను దాచిపెట్టుకుని పులిపై భీకర గర్జనలతో విరుచుకపడిన వీడియో వైరల్ గా మారింది.

బిడ్డను కాపాడుకునే క్రమంలో పులిపై మహోగ్రహంతో దాడి చేసిన ఎలుగుబంటిని చూసిన పెద్దపులి దెబ్బకు జడుసుకుని తోక ముడిచి పారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు తల్లి ప్రేమ ముందు ఆపదలు చిన్నవే నంటూ కొందరు..తల్లి ప్రేమ బలం ముందు అడవి రాజులు పులులు, సింహాలపై బలాదూర్ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version