మీ ఇంటి ఆడపడుచుగా వస్తున్నా.. నాభర్త రోహిత్ ను గెలిపించండి: శివానీ రెడ్డి

  • Publish Date - November 4, 2023 / 03:10 PM IST

విధాత, మెదక్ బ్యూరో: మీ ఇంటి ఆడబిడ్డగా ప్రజల ముందుకు వస్తున్నానని, మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ ను గెలిపించాలని సతీమణి శివానీ రెడ్డి కోరారు. శనివారం ఆమె మెదక్ పట్టణంలోని 24, 25, 26, 27 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ చేయబోనున్న అభివృద్ధి పథకాలపై ఆమె వివరించారు. నాభర్త రోహిత్ ప్రజలకు సేవ చేయడం కోసమే మీ నియోజకవర్గాన్ని ఎంచుకున్నాడని, ఎల్లప్పుడూ మీవెంటే నా భర్త రోహిత్ అందుబాటులో ఉండి ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా పిలుస్తే పలుకుతాడని ఆమె అన్నారు.


జగమంత కుటుంబం మా మైనంపల్లి కుటుంబం అని… ఏ కులాన్ని, ఏ మతాన్ని కూడా తక్కువ చేయకుండా అన్ని మతాలు, కులాల వారిని కలుపుకొని పోయే ఏకైక కుటుంబం మైనంపల్లిది అని అన్నారు. మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుకు వేసి భారీ మెజార్టీతో మైనంపల్లి రోహిత్ ను గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గూడూరి ఆంజనేయులు, మాజీ మున్సిపల్ చైర్మన్ కొండన్ సురేందర్ గౌడ్, న్యాయవాది జీవన్ రావు, బొజ్జ పవన్, ఉప్పల రాజేష్, కౌన్సిలర్లు దాయర లింగం, ఆవారి శేఖర్, మాజీ కౌన్సిలర్ లల్లూ, మున్నా, ఎంఎస్ఎస్ఓ సభ్యులు సంగమేశ్వర్, మైసన్, అబ్దుల్ నజీబ్, ఖైప్, షోయబ్, సఫాన్, హాజీ, బాబార్ బాయి, షేద్ దరీ, ఖాజా, హపీల్ పాల్లొన్నారు.