విధాత : నాగర్ కర్నూల్‌లో ఓట్ల కోసం దళితులకు హామీలిచ్చి వారితో ప్రమాణం చేయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్‌లో దళిత కమ్యూనిటీ హాల్‌కు స్లాబ్ వేయిస్తానంటూ గ్రామ బీఆరెస్ నాయకుడు రఘుమారెడ్డి దళితులకు హామీ ఇచ్చారు. అయితే వారితో బీఆరెస్ అభ్యర్ధి మర్రి జనార్ధన్ రెడ్డికే ఓటు వేస్తామని చెన్నకేశవ స్వామి సాక్షిగా ప్రమాణం చేయించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.