నారాయణ పేట బీఆరెస్ కు బిగ్ షాక్..కాంగ్రెస్ గూటికి జడ్పీచైర్ పర్సన్ వనజ

  • Publish Date - November 5, 2023 / 01:37 PM IST

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ కు రోజుకో షాక్ తగలుతోంది. అధికార పార్టీని వీడే వారి సంఖ్య అధికమవుతోంది. నారాయణ పేట బీఆర్ఎస్ కు చెందిన జడ్పీ చైర్ పర్సన్ వనజ ఆదివారం ఆపార్టీని వీడారు. హైదరాబాద్ లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. కండువా కప్పి ఆమెను రేవంత్ పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వనజ మాట్లాడుతూ, స్థానిక బీఆరెస్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వక పోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ విషయమై ఆమె స్వయంగా కార్యకర్తల వద్ద వాపోయారు. బీఆర్ఎస్ ఒంటెద్దు పోకడ నచ్చక పార్టీని వీడినట్లు ఆమె తెలిపారు. నారాయణ పేట, మక్తల్ నియోజకవర్గాల కాంగ్రెస్ అభ్యర్థులకు తన మద్దతు ఉంటుందని వనజ ప్రకటించారు.