క్రీడా స్ఫూర్తితో జీవితంలో రాణించాలి: మంత్రి జగదీష్‌రెడ్డి

విధాత: క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ఓటమి గెలుపుకు సోపానమని, విద్యార్థులు, యువత క్రీడాస్ఫూర్తితో జీవితంలో రాణించేందుకు కృషి చేయాలని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట పట్టణంలో అండర్ 17 మండల స్థాయి కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. జీవితమే ఒక ఆట అని, ఓటమే గెలుపుకు నాంది అన్నారు. క్రీడల్లోగాని, జీవితంలో గాని ఓటమి చెందానని కుంగిపోవద్దని, గెలుపు కోసం ప్రయత్నాలు ఆపొద్దని ఉద్భోధించారు. సహనం ఉంటే విజయం నీ సొంతమన్నారు. ప్రతి […]

  • Publish Date - January 7, 2023 / 10:27 AM IST

విధాత: క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ఓటమి గెలుపుకు సోపానమని, విద్యార్థులు, యువత క్రీడాస్ఫూర్తితో జీవితంలో రాణించేందుకు కృషి చేయాలని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట పట్టణంలో అండర్ 17 మండల స్థాయి కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు.

జీవితమే ఒక ఆట అని, ఓటమే గెలుపుకు నాంది అన్నారు. క్రీడల్లోగాని, జీవితంలో గాని ఓటమి చెందానని కుంగిపోవద్దని, గెలుపు కోసం ప్రయత్నాలు ఆపొద్దని ఉద్భోధించారు.

సహనం ఉంటే విజయం నీ సొంతమన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలన్నారు.
గ్రామీణ క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం తగిన ప్రోత్సాహం ఇస్తుందన్నారు.