ఖానాపూర్ బీజేపీ టికెట్ అమ్ముకున్నారు: పెంబి జడ్పీటీసీ జాను భాయ్

నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ బీజేపీ టికెట్ అనర్హులకు కేటాయించారని, సూట్ కేసులు ఇచ్చిన వారికి టికెట్లు అమ్ముకున్నారని పెంబి జడ్పీటీసీ జాను భాయ్ ఆరోపించారు

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ బీజేపీ టికెట్ అనర్హులకు కేటాయించారని, సూట్ కేసులు ఇచ్చిన వారికి టికెట్లు అమ్ముకున్నారని పెంబి జడ్పీటీసీ జాను భాయ్ ఆరోపించారు. ఖానాపూర్ జిల్లా పెంబి మండలకేంద్రంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఖానాపూర్ టికెట్ కేటాయింపు విషయంలో రాష్ట్ర అధిష్టానం నిర్ణయాన్ని ఆమె తప్పుబట్టారు.

భాజపా పార్టీ సిద్ధాంతాలను తుంగలో తొక్కి, సూట్ కేసులకు టిక్కెట్ అమ్ముకున్నారని ఆరోపించారు. మొదటి నుంచి పార్టీని పట్టుకుని, పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన వాళ్లకు టికెట్ కేటాయించక పోవడం శోచనీయమన్నారు. గతంలో ఇదే నాయకులు ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పటికీ ఖానాపూర్ నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేశారని విమర్శించారు. అధిష్టానం పునరాలోచించి తనకు టికెట్ కేటాయించి న్యాయం చేయాలని కోరారు. అధిష్టానం నిర్ణయం మార్చుకొని తనకు టికెట్ కేటాయించాలని, లేనిపక్షంలో రెండు రోజుల్లో భవిషత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు.