విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని కాంక్షిస్తూ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారానికి రానున్నారు. మోడీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వరుసగా మూడు రోజులలు ఆయన తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈనెల 25న మహేశ్వరం, కామారెడ్డి సభల్లో, 26న తూఫ్రాన్, నిర్మల్, 27న మహబూబ్‌బాద్, కరీంనగర్ ప్రచార సభల్లో మోడీ పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం హైద్రాబాద్‌లో నిర్వహించే భారీ రోడ్ షోకు మోడీ హాజరవుతారు. మోడీ ప్రచార సభల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పాల్గొననున్నారు.